టాలీవుడ్ ప్రముఖు నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప 2 పై రోజురోజుకి అందరిలో కూడా విశేషమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థపై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని గ్రాండ్ గా నిర్మిస్తుండగా కీలకపాత్రల్లో ఫహాద్ ఫాసిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు, రావు రమేష్ నటిస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ పోస్టర్లు అన్నీ కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే విషయం ఏమిటంటే మొన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్లో భాగంగా ఒకింత నిర్మాతలపై అసహనం వ్యక్తం చేశారు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.
ఇక ఈ ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా నేడు వాటిపై నిర్మాతలు స్పందిస్తూ నిజానికి దేవిశ్రీప్రసాద్ గారి వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆయన మా పై ఉన్నటువంటి ప్రేమని ఆ విధంగా వ్యక్తపరిచారని రాబోయే రోజుల్లో ఆయనతో మరిన్ని సినిమాలు చేయడానికి తాము సిద్ధమని ఆయన కూడా మనతో పనిచేస్తారని, మా మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని వారు క్లారిటీ ఇచ్చారు.