ఆర్.ఆర్.ఆర్ సినిమాతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కేవలం తన కెరీర్ లోనే కాదు భారతీయ సినిమా చరిత్రలనే అరుదైన బ్లాక్ బస్టర్ అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా చేయనున్నారు. వీరి కలయికలో ఒక సినిమా కోసం మహేష్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.
వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటూ గత పదేళ్లుగా వార్తలు వస్తున్నాయి. అవి ఎట్టకేలకు ఇన్నెళ్లకు నిజం కాబోతున్నాయి. ఇటీవలే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిన తర్వాత దానికి సంభందించి ఒక్కో ఆసక్తికర విషయం తెలుస్తూ వస్తుంది. తాజాగా హాలీవుడ్ స్టూడియోతో రాజమౌళి జతకట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఆర్ అర్ అర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు సంపాదించుకుంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. గ్లోబల్ ఆడియన్స్ నుండి విశేష స్థాయిలో ప్రశంసలు దక్కించుకున్న ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్ లో స్క్రీనింగ్ చేశారు. లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటల్స్ లో ఉన్న అతిపెద్ద IMAX స్క్రీన్లో RRR చిత్రాన్ని స్పెషల్ గా ప్రదర్శించారు. బియాండ్ ఫెస్ట్ లో భాగంగా ఒరిజినల్ వెర్షన్ ను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్క్రీనింగ్ చేసారు. దీనికి రాజమౌళి కూడా హాజరయ్యారు.
ఇదిలా ఉండగా రాజమౌళి.. మహేష్ తో సినిమా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. మహేష్ తో తను చేసే సినిమా తన కెరీర్ లోనే అతి పెద్ద సినిమా అవుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ చిత్రం గురించి తను చెప్పిన globe trotting అనే పదం ట్రెండింగ్ లో ఉందని కూడా ఆయన సరదాగా మాట్లాడారు. ఇలా అవకాశం దొరికిన ప్రతిసారీ రాజమౌళి ఈ సినిమా పై భారీ స్థాయిలో ఆశలు రేపుతున్నారు.
ఏదేమైనా ‘బాహుబలి’ సీరీస్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు RRR సినిమాతో అంతర్జాతీయ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక మహేష్ తో తీయబోయే తదుపరి విశ్వ వ్యాప్తంగా తెలుగు సినిమా పరిశ్రమతో పాటు యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులు గర్వపడే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుందాం.