సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సంగీత దర్శకుడు థమన్ పై ఒక చవకబారు, అనవసరమైన నెగెటివిటీతో కూడిన ట్రెండ్ ను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయగా, వాటన్నింటికీ థమన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
మహేష్ బాబు అభిమానులు నిన్న ట్విట్టర్ లో Remove Thaman from SSMB28 అనే హ్యష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో థమన్ కూడా భాగం అవుతారని అధికారికంగా ప్రకటన చేసినప్పటి నుంచి ఈ సినిమా కోసం థమన్ ను ఎంపిక చేయడం పై మహేష్ అభిమానుల్లో విపరీతమైన నెగిటివిటీ ఉంది.
మహేష్ బాబు గత చిత్రం సర్కారు వారి పాటకు తమన్ పని చేయగా మహేష్ అభిమానులు ఆయన ఇచ్చిన అవుట్ పుట్ తో సంతృప్తి చెందలేదు. కళావతి చార్ట్ బస్టర్ కావడంతో పాటలు కనీసం డీసెంట్ గా ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వారిని ఏమాత్రం ఆకట్టుకోలేదు. అందుకే తనను SSMB28 కు ఎంపిక కావడం పట్ల వారు సంతోషంగా లేరు.
అయితే తన పై వస్తున్న నెగిటివ్ ట్రెండింగ్ పై థమన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో స్పందించారు. రెస్ట్ ఇన్ పీస్.. మై డియర్ నెగెటివిటీ అంటూ ఓ చిన్న వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకు తన అభిమాన హీరోను మారుస్తూ, ప్రతి ప్రాజెక్ట్ ను తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న థమన్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎవరో ఒకరికి ఫ్యాన్ అని చెప్తే పరవాలేదు కానీ అందరికీ అభిమానిని అని అంటే ఎలా అని వారు థమన్ ను హేళన చేశారు.