టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసికల్ మూవీ మురారి. సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా సత్యనారాయణ, లక్ష్మి, ప్రసాద్ బాబు, చిన్నా, అనిత చౌదరి, రఘుబాబు, రవి బాబు, లక్ష్మీపతి తదితరులు కీలక పాత్రలు చేసారు.
2001లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని నిన్న థియేటర్స్ లో రీ రిలీజ్ చేశారు. కొద్దిరోజుల క్రితం ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా మంచి కలెక్షన్ అందుకున్న ఈ మూవీ ఓపెనింగ్స్ లో ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. రీ రిలీజ్ రోజున ఈ మూవీ ఏకంగా రూ. 5.3 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని రీ రిలీజ్ లో టాప్ ఓపెనింగ్ డే కలెక్షన్ అందుకున్న టాప్ మూవీగా నిలిచింది.
వాటిలో నైజాం నుండి రూ. 2.9 కోట్లు రాబట్టగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల నుండి రూ. 4.4 కోట్లు అలానే ఓవర్సీస్ నుండి రూ. 55 లక్షలు కలెక్షన్ కలిగి ఉండడం విశేషం. కాగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ బిజినెస్ మ్యాన్ మూవీ రీ రిలీజ్ ఫస్ట్ డే రూ. 5.2 కోట్లు సొంతం చేసుకోవడంతో దానిని ఇప్పుడు మురారి బ్రేక్ చేసింది. కాగా రెండవ రోజు కూడా మురారికి మంచి కలెక్షన్ లభిస్తున్నట్లు ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు.