టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మురారి. బాలీవుడ్ నటి సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 2001లో రిలీజ్ అయి అప్పట్లో పెద్ద విజయం సొంతం చేసుకుంది.
ఈ ఫ్యామిలీ యాక్షన్ క్లాసికల్ ఎంటర్టైనర్ మూవీలో మహేష్ బాబు సూపర్ పెర్ఫార్మన్స్ తో పాటు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, కృష్ణవంశీ టేకింగ్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రానున్న ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఈ క్లాసికల్ సూపర్ హిట్ మూవీని మళ్ళి థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
విషయం ఏమిటంటే, రెండు రోజుల క్రితం పలు ప్రాంతాల్లో మురారి మూవీ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా చాలా ప్రాంతాల్లో టికెట్స్ హాట్ కేక్స్ ల అమ్ముడవుతుండడం విశేషం. గతంలో కూడా మహేష్ బాబు నటించిన పోకిరి, బిజినెస్ మ్యాన్, ఒక్కడు మూవీస్ రీ రిలీజ్ లో సంచలనాలు సృష్టించాయి. ఇప్పుడు మురారి కూడా ఓవరాల్ గా రిలీజ్ లో భారీ కలెక్షన్ అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.