టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో చేయనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 కోసం యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. ఈ మూవీలో మహేష్ బాబు పవర్ఫుల్ రోల్ లో కనిపించనుండగా దీనిని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో కేఎల్ నారాయణ నిర్మించనున్నారు.
కాగా ఈ మూవీ కోసం ఇప్పటికే మహేష్ బాబు బల్క్ బాడీతో పాటు ఫుల్ గా క్రాఫ్ గడ్డం పెంచుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రారంభం అయి పూర్తి కావడానికి చాలానే సమయం పడుతుందని తెలుస్తోంది. ఇక ఈలోపు తమ అభిమాన సూపర్ స్టార్ యొక్క గత సినిమాలని రీరిలీజ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.
ఇక ఇటీవల ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన మురారి మూవీ ఫస్ట్ డే రూ. 7 కోట్లు రాబట్టి మొత్తంగా క్లోజింగ్ లో రూ. 9 కోట్ల కలెక్షన్ ని సొంతం చేసుకుంది. తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ మూవీ ఫస్ట్ డే ఆ ఫిగర్ ని దాటలేకపోయింది మరియు ఓవరాల్ గా క్లోజింగ్ కి గబ్బర్ సింగ్ రూ. 8 కోట్ల మేర మాత్రమే రాబట్టే అవకాశం ఉంది. మొత్తంగా దీనిని బట్టి చూస్తే మురారి మూవీ రీ రిలీజెస్ లో ఆల్ టైం నెంబర్ స్థానంలో నిలిచిందని చెప్పవచ్చు.