Homeసినిమా వార్తలుOTT: నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న పలు తెలుగు సినిమాలు

OTT: నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న పలు తెలుగు సినిమాలు

- Advertisement -

ఈ రోజు రాత్రి నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానున్న పలు సినిమాలు ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. వాటిలో ఒకటి ధనుష్ తాజా ద్విభాషా చిత్రం సార్/వాతి, సుహాస్ రైటర్ పద్మభూషణ్ కాగా, మరో చిన్న చిత్రం సత్తి గాని రెండు ఎకరాలు నేరుగా ఓటీటీలో విడుదల కానున్నాయి.

సంయుక్తా మీనన్ కథానాయికగా నటించిన తాజా చిత్రం సార్/వాతితో ధనుష్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా తెలుగులో సర్ ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఈ చిత్రం ఈ రోజు రాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

అయితే మొదట తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ ఫిక్స్ చేసిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ఈ నెల 17 నుంచి హిందీలో కూడా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ధృవీకరించింది. దీంతో నార్త్ ఆడియన్స్ కు కూడా ఈ సినిమా మంచి ట్రీట్ ఇవ్వనుంది. జి.వి.ప్రకాష్ సంగీతం అందించిన్ ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.

READ  RC15: ఆర్ సి 15 సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేసిన లీకైన వీడియోలు

మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై అభినవ్ దండా దర్శకత్వంలో కొల్లూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం ‘ సత్తి గాని రెండు ఏకరాలు’. జగదీష్ ప్రతాప్ బండారి, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, మోహన శ్రీ, రాజ్ తిరందాసు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆహా వీడియో ప్లాట్ ఫారంలో స్ట్రీమింగ్ కానుంది.

ఇక రైటర్ పద్మభూషణ్ సినిమా యొక్క శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్మభూషణ్ గా సుహాస్, సారికగా టీనా శిల్పారాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ, గౌరీప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Shaakuntalam: సమంత నటించిన శాకుంతలం సినిమాకు భారీ ఆర్థిక ఇబ్బందులు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories