Home సినిమా వార్తలు ఈ వారం OTTలో విడుదలైన సినిమాల వివరాలు

ఈ వారం OTTలో విడుదలైన సినిమాల వివరాలు

Multiple Movies Streaming On OTT Now; Streaming Details Are Here

సినీ ప్రియులకు ఎంతో ఇష్టమైన శుక్రవారం మళ్ళీ వచ్చింది. మరియు ఇంట్లోనే ప్రేక్షకులను అలరించడానికి OTTలో కొత్త విడుదలలు వరుస కట్టాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ అయిన సినిమాలే కాకుండా డిజాస్టర్‌ అయిన సినిమాలు.. అలాగే స్ట్రెయిట్ సినిమాల నుండి డబ్బింగ్ సినిమాల వరకు OTT విడుదలలు చాలా ఉన్నాయి. వారాంతపు సమయంలో ఎంటర్టైన్మెంట్ ను అందించే OTT విడుదలల జాబితా ఇదిగో..

ధనుష్, నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిత్రంబలం చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించే సున్నితమైన హాస్యం, భావోద్వేగాలు కలగలిపిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. నిత్యా మీనన్ మరియు ధనుష్ అద్భుతమైన, సహజసిద్ధమైన నటన.. ఇద్దరి మధ్య పండిన అందమైన కెమిస్ట్రీ ఈ చిత్రాన్ని మరోస్థాయిలో నిలబెట్టాయి. తిరుచిత్రంబలం సినిమా ఇప్పుడు తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషలలో SUN NXT OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతోంది.

ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రచార కార్యక్రమాలతో అందరిలో ఎంతో ఆసక్తిని పెంచిన సినిమా. ట్రైలర్ మరియు ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుండి, ప్రేక్షకులు ఈ చిత్రం పట్ల ఆకర్షితులై దర్శకుడు అనుదీప్ తరహాలో చక్కని కామెడీ ఎంటర్‌టైనర్‌ని ఆశించారు, కానీ వారి ఆశలను అన్నిటినీ తుంచేస్తూ తేలికపాటి పేలవమైన కంటెంట్ ను ఈ సినిమా అందించింది. ఈ సినిమా తొలిరోజునే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి జీరో షేర్‌ను మూట గట్టుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఆహా తెలుగు ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతోంది.

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన బబ్లీ బౌన్సర్ అనే సినిమా కూడా ఈ వారం నెట్టింట విడుదలయింది. ఒక మహిళా బౌన్సర్ గురించిన కామెడీ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. మగవాళ్ళే ఎక్కువగా ఉండే తన ప్రపంచంలో బాబ్లీ ఎలా బ్రతుకుతుంది అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రం అన్ని భాషల్లో డిస్నీ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ఎక్స్ క్లుజీవ్ గా ప్రసారం చేయబడుతుంది.

కళాపురం అనే మరో తెలుగు హాస్య చిత్రం కూడా ఈరోజు విడుదలైన సినిమాల లిస్ట్ లో ఉంది. కాగా ఈ చిత్రంలో సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించారు. ZEE5 OTT ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా ప్రసారం అవుతోంది.

వీటన్నింటితో పాటు విజయ్ దేవరకొండ సినిమా లైగర్ కూడా ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం లైగర్ OTTలో ప్రసారం అవుతోంది. ఘోరమైన థియేట్రికల్ రన్ తర్వాత, ఈ సినిమా కనీసం OTTలో అయినా కాస్త మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version