Homeసినిమా వార్తలుసీత కావాలంటే కోటి ఇవ్వాల్సిందే అంటున్న మృణాల్

సీత కావాలంటే కోటి ఇవ్వాల్సిందే అంటున్న మృణాల్

- Advertisement -

సీతారామం… ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. యుద్ధం రాసిన ప్రేమకథ అంటూ ఒక మిలిటరీ అధికారికి.. యువరాణికి మధ్య సాగే ఓ అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ రామ్ గా బాలీవుడ్ నటి/మోడల్ మృణాల్ ఠాకూర్ సీతగా నటించారు. వారి నటనకు మరియు జోడీకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో వారి పాత్రలకు వారు తప్ప మరే నటీనటుల్ని ఊహించుకొలేని స్థాయిలో దుల్కర్ మృణాల్ ప్రేక్షకులను మెప్పించారు.

ప్రస్తుతం సీతకి అదే మృణాల్ కు తెలుగులో వరుస ఆఫర్లు పలకరిస్తున్నాయి. మరి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి అనే సామెత చెప్పినట్లు.. హీరోయిన్ మృణాల్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసారని సమాచారం. సాధారణంగానే తెలుగులో హీరోయిన్లకు డిమాండ్ అధిక స్థాయిలో ఉంటుంది.. అందువల్లే ఏదైనా కొత్త సినిమా భారీ హిట్ సాధిస్తే, ఆ హీరోయిన్ కు మంచి పేరు వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుని ఆయా హీరోయిన్లు తమ పారితోషికాన్ని పెంచేస్తుంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోయిన్లకి కెరీర్ వ్యవధి తక్కువ కాబట్టి.. ఎన్ని రోజులు వాళ్ళు కొనసాగుతారో తెలియదు కాబట్టి హీరోయిన్లు తమ పారితోషికాన్ని క్రేజ్ ఉన్నప్పుడు పెంచుతూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే ‘సీతారామం’ వంటి హిట్ తర్వాత హీరోయిన్ మృణాల్ సైతం తన రెమ్యునరేషన్ ను పెంచేసారని తెలుస్తుంది.. ప్రస్తుతం ఒక సినిమాలో తను నటించాలి అంటే కోటి రూపాయలు కావాల్సిందే అని మృణాల్ డిమాండ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె అలా అడిగింది నిజమే అయితే.. నిర్మాతలకు కళ్ళు తిరగడం ఖాయం అనే చెప్పాలి.ప్రస్తుతం సీతా రామం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మృణాల్ .. అధికారికంగా మరే తెలుగు సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించలేదు.. అయితే తనకు తొలి చిత్రంతోనే అద్భుతమైన సినిమాని నిర్మించిన వైజయంతి బ్యానర్ లోనే ఆమె మరో సినిమా చేయబోతున్నారని సమాచారం. ఆ సినిమాకు నందిని దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

READ  తన పై వచ్చిన పుకార్లను నిజం చేసిన సమంత

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories