మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు మేకర్స్. కాగా మిస్టర్ బచ్చన్ టీజర్ ని జులై 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా హిందీలో తెరకెక్కి మంచి విజయం అందుకున్న ది రెయిడ్ కి ఇది అఫీషియల్ రీమేక్.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన మిస్టర్ బచ్చన్ తప్పకుండా ఆడియన్స్ ని రవితేజ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి చాలా గ్యాప్ తరువాత హరీష్ శంకర్, రవితేజ ల కాంబోలో వస్తున్న ఈమూవీ ఆగష్టు 15న రిలీజ్ తరువాత ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.