మాస్ మహారాజా రవితేజ ఇటీవల కార్తీక్ ఘట్టమనేని తీసిన ఈగిల్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ యక్షన్ ఎంటర్టైనర్ మంచి విజయం అందుకుంది. దాని అనంతరం ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు రవితేజ.
ఇటీవల హిందీలో అజయ్ దేవగన్ హీరోగా రూపొంది సక్సెస్ సాధించిన ది రెయిడ్ మూవీకి అఫీషియల్ రీమేక్ ఇది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. విషయం ఏమిటంటే, నేడు ఉదయం ఈ మూవీ నుండి సితార్ అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. మంచి మెలోడియస్ బీట్ తో సాగే ఈ సాంగ్ ని సాకేత్, సమీరా భరద్వాజ్ అద్భుతంగా పాడగా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ కంపోజ్ చేసారు. ఇక ఈ సాంగ్ ని సాహితి రచించారు.
అలరించే విజువల్స్, డ్యాన్స్ మొమెంట్స్ తో సితార్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి ఆదరణ అందుకుంటోంది. కాగా మిస్టర్ బచ్చన్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి త్వరలో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.