టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మాస్ మహారాజా రవితేజ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ ద్వారా అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించింది.
మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈమూవీ ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయం అందుకున్న ది రెయిడ్ కి అఫీషియల్ రీమేక్. విషయం ఏమిటంటే నేడు గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ మూవీ. మొత్తంగా మిస్టర్ బచ్చన్ ఏమాత్రం ఆకట్టుకోలేక మిస్ ఫైర్ బచ్చన్ అయింది.
నిజానికి దర్శకుడు హరీష్ ఎక్కువగా మెయిన్ పాయింట్ కంటే కమర్షియల్ హంగులు, సాంగ్స్, హీరోయిన్ మీదనే ఫోకస్ చేసారు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదు, ఇది మొత్తంగా ఒక ఫక్తు రొటీన్ కమర్షియల్ రీమేక్. అలానే ఇది రవితేజ ఫ్యాన్స్ ని కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవచ్చు. మరి రేపటి నుండి ఈ మూవీ ఎంతమేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ
మ్యూజిక్
ఫైట్స్
మైనస్ పాయింట్స్ :
పేలవమైన రైటింగ్
రన్ టైం
కామెడీ సీన్స్
రొటీన్ రొట్ట సీన్స్
తీర్పు :
చివరిగా చెప్పాలి అంటే మిస్టర్ బచ్చన్ మూవీ ప్రారంభం నుండి అటు రవితేజ ఫ్యాన్స్ లో ఇటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నప్పటికీ నేడు రిలీజ్ అయిన ఈ మూవీ అవి అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
రేటింగ్ : 2 / 5