మాస్ మహారాజా రవితేజ హీరోగా నూతన నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ మిస్టర్ బచ్చన్. ఇటీవల బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన ది రెయిడ్ కి ఇది అఫీషివయల్ రీమేక్.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక రేపు విడుదల కానున్న ఈ మూవీకి నేడు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ పూర్తికాగా ప్రస్తుతం సెకండ్ హాఫ్ జరుగుతోంది.
వాస్తవానికి రీమేక్స్ ని మంచి మాస్ కమర్షియల్ స్టైల్ లో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన హరీష్ శంకర్ దీనిని కూడా బాగానే తెరకెక్కించినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు పూర్తయిన ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ పాత పాటల రిఫరెన్స్ లు ఎక్కువ ఉండడం, హృద్యమైన పాత్రలు మరియు ఆకట్టుకునే భావోద్వేగ సన్నివేశాలు లేకపోవడం వంటి లోపాలు ఉన్నాయి. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.