Homeసినిమా వార్తలుఅఖిల్ అక్కినేని ఏజెంట్ టీజర్ అదుర్స్ అంటున్న టీమ్

అఖిల్ అక్కినేని ఏజెంట్ టీజర్ అదుర్స్ అంటున్న టీమ్

- Advertisement -

అక్కినేని వారసుడు యంగ్ అండ్ హ్యాండ్సం హీరో అఖిల్ నుండి తదుపరి రాబోయే సినిమా “ఎజెంట్”. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసి మీదున్న ఈ హీరో డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ఆ భాద్యతగా అప్పగించాడు.

ఇది వరకే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అయి అందరినీ ఆకట్టుకుంది. డాషింగ్ లుక్ లో అఖిల్ అదిరిపోయాడు. వాటితో పాటు షూటింగ్ నుండి లీక్ అయిన కొన్ని పిక్ లే కాక, అఫిషియల్ గా అఖిల్ పోస్ట్ చేసిన సిక్స్ ప్యాక్ లుక్ కూడా సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. 

ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు, ఈసారి తమ అభిమాన హీరో టార్గెట్ మిస్ అవ్వడు అనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే టీజర్ వచ్చే దాకా ఆగక తప్పదు. మొదట ఎజెంట్ టీజర్ మేలో వస్తుంది అన్న వార్తలు వచ్చాయి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం జూన్ నెల అఖరిలో ఏజెంట్ టీజర్ ను తీసుకు రావడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తుంది. ఇక టీజర్ మాత్రం అద్భుతంగా వచ్చిందని, టీమ్ మొత్తం ఔట్ పుట్ తో చాలా ఆనందంగా ఉందని తెలుస్తుంది. శరవేగంగా పనులు పూర్తి చేసుకుని సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు అని సమాచారం.

అఖిల్ సరసన హీరోయిన్ హా సాక్షి వైద్య నటిస్తున్న ఈ సినిమాలో మలయాళం అగ్ర హీరో మమ్ముట్టి ముఖ్య పాత్రలో నటిస్తుండగా, రచయిత వక్కంతం వంశీ కధను అందించనున్నారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ సంగీతం ఇస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ 2 సినిమా బ్యానర్ తో పాటు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్  సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రఘల్ హేరియన్ ధరుమన్ కెమెరామెన్ గా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ జిల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

READ  ఏనుగునే భయపెట్టిన విక్రమ్

తొలి చిత్రం అఖిల్ భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అవడంతోటే నిరాశ పడకుండా రెట్టించిన ఉత్సాహంతో హలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్. ఆ సినిమా కాస్త పరవాలేదు అనిపించగా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మళ్ళీ నిరాశే మిగిలింది. ఆ తరువాత వచ్చిన మిస్టర్ మజ్ను కూడా పరాజయం పాలయ్యింది. పోయిన దసరాకి వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ డీసెంట్ హిట్ గా నిలవడంతో అఖిల్ మరింత అత్న విశ్వాసంతో ఎజెంట్ సినిమాతో మళ్లీ అలరించేందుకు వస్తున్నాడు. 

Follow on Google News Follow on Whatsapp

READ  ఓటీటీ లో జయమ్మ పంచాయితీ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories