టాలీవుడ్ స్టార్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం ఎప్పటి నుండి నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఆ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ నేడు వచ్చింది. కాగా నేడు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా తన డెబ్యూ మూవీని అనౌన్స్ చేసారు.
ఇటీవల హను మాన్ మూవీతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ తన పివిసియు లో భాగముగా ఈ మూవీ రూపొందనుంది. లెజెండ్ ప్రొడక్షన్స్ సంస్థ పై నందమూరి తేజస్విని, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ పై సుధాకర్ చేరుకూరి గ్రాండ్ లెవెల్లో రూపొందించనున్న ఈ మూవీ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.
ఇక రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పిక్ లో స్టైలిష్ ట్రెండీ కాస్ట్యూమ్స్ తో నందమూరి మోక్షజ్ఞ అదరగొట్టారు. త్వరలో ఈ ప్రతిష్టాత్మక మూవీ గురించిన పూర్తి వివరాలు క్యాస్టింగ్ వంటివి వెల్లడి కానున్నాయి. కాగా దీనిని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఫస్ట్ మూవీతో ఎంతవరకు నందమూరి ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మోక్షజ్ఞ మెప్పిస్తారో చూడాలి