టాలీవుడ్ నటుడు విష్ణు మంచు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీ కన్నప్ప. ఈ మూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా అత్యంత భారీ వ్యయంతో ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో శరత్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, యోగిబాబు, బ్రహ్మానందం, ముకేశ్ ఋషి, అక్షయ్ కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. కాగా ఈ మూవీ నుండి నేడు ప్రభాస్ పోషిస్తున్న రుద్ర పాత్ర యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. అయితే ఈ లుక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన అయితే లభిస్తోంది.
కొందరు బాగుంది అంటుంటే మరికొందరు మాత్రం లుక్ విషయంలో టీమ్ మరింత శ్రద్ద తీసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా రోజు రోజుకు అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరుస్తున్న కన్నప్ప ఏప్రిల్ 25న భారీ స్థాయిలో రిలీజ్ అనంతరం ఎంత మేర విజయంతో ఆకట్టుకుంటుందో చూడాలి.