యువ నటుడు తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ మిరాయ్. ఈ మూవీలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా విలక్షణ నటుడు మంచు మనోజ్ విలన్ పాత్ర చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అవుతున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారు. ఇక మరోవైపు ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అనుష్క చేస్తున్న మూవీ ఘాటీ. ఈ మూవీలో విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రమ్యకృష్ణ, జపపతి బాబు, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఘాటీ థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచింది.
ఇక ఈమూవీని కూడా సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారు. ఆ విధంగా అటు మిరాయ్, ఇటు ఘాటీ రెండూ కూడా ఒకేరోజున ఆడియన్సు ముందుకి రానుండడంతో వీటి మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడనుంది. కాగా వీటితో పాటు మురుగదాస్ తీస్తున్న మదరాసి, విజయ్ ఆంటోని భద్రకాళి సినిమాలు కూడా అధ్ రోజున రిలీజ్ కానున్నాయి.
అలానే రష్మిపై నటిస్తోన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ యొక్క రిలీజ్ కూడా అదే రోజున ఉండడంతో వీటిలో ఏది ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. అయితే ఎక్కువగా ఆడియన్స్ యొక్క దృష్టి ఘాటీ, మిరాయ్ మూవీస్ పై మరి ఈ బాక్సాఫీస్ పోరు ఏవిధంగా సాగుతుందో.