యువ నటుడు తేజ సజ్జ హీరోగా యువ అందాల నటి రితికా నాయక్ హీరోయిన్ మంచు మనోజ్ విలన్ గా తెరకెక్కుతున్న యాక్షన్ లేటెస్ట్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ మిరాయ్. ఈ మూవీని యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గ్రాండ్ గా నిర్మిస్తుండగా గౌర హరి సంగీతం అందిస్తున్నారు.
సూపర్ యొద్ద అనే కాన్సెప్ట్ తో గ్రాండ్ గా రూపొందిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకోగా తాజాగా మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ముఖ్యంగా ట్రైలర్ లో గ్రాండియర్ విజువల్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ వంటివి ఎంతో బాగున్నాయి. ”ఈ ప్రమాదం ప్రతీ గ్రంధాన్నీ చేరబోతోంది.
దాన్ని ఆపడానికి నువ్వు మిరాయ్‌ని చేరుకోవాలి”. ”నా గతం నా యుద్ధం నా ప్రస్తుతం ఊహాతీతం” ”తొమ్మిది గ్రంధాలూ వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం” వంటి డైలాగ్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంటాయి. చాలా విజువల్స్ అవుట్ స్టాండింగ్ అనిపించాయి. ఈ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ మేకింగ్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు.
డ్రాగన్ తో చేసే ఫైట్, చివర్లో శ్రీరాముడి దర్శనం ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మొత్తంగా మిరాయ్ ట్రైలర్ సినిమా పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసింది. పైగా అన్ని భాషల్లో కూడా పెద్ద సంస్థలు దీని యొక్క హక్కులు కొనుగోలు చేయడంతో మూవీ మంచి టాక్ వస్తే పెద్ద నంబర్స్ రాబట్టే అవకాశం ఉంది. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 12న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది.