Homeసినిమా వార్తలుVeera Simha Reddy: బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో కొన్ని చోట్ల స్వల్ప నష్టాలు

Veera Simha Reddy: బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో కొన్ని చోట్ల స్వల్ప నష్టాలు

- Advertisement -

బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈ సంక్రాంతికి విడుదలై మిక్స్ డ్ రివ్యూలు, పబ్లిక్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లను సాధించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టి అద్భుతమైన ఓపెనింగ్ వీకెండ్ ను సొంతం చేసుకుంది.

అయితే పండుగ రోజుల తర్వాత అన్ని ఏరియాల్లో ఈ సినిమా బాగా పడిపోయింది. వీకెండ్స్ లో కూడా ఈ సినిమా తక్కువ స్థాయిలోనే కొనసాగింది. ఫెస్టివల్ డే అడ్వాంటేజ్ తో సినిమా బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఈ సినిమా తక్కువ స్థాయిలో నష్టాలు తెచ్చుకుంది.

పైన చెప్పినట్టుగా పండగ రోజుల తర్వాత వీర సింహారెడ్డి పడిపోవడం, ఆ తర్వాతి వారాంతాల్లో ఆ సినిమా పూర్తిగా క్రాష్ అవ్వడం, బాలకృష్ణ సినిమాకు లోటుపాట్లు రావడంతో చాలా థియేటర్లలో వాల్తేరు వీరయ్య ఆ సినిమా స్థానాన్ని భర్తీ చేశారు.

వసూళ్లు తగ్గుముఖం పట్టడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రన్ దాదాపుగా ముగిసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఓపెనింగ్ డే సోలోగా దొరకడంతో పాటు పండగ రోజులు కూడా సినిమాకు హెల్ప్ అయ్యాయి.

నైజాంలో GST, P&P మినహాయించి 15 కోట్ల రూపాయలకు సినిమాను విక్రయించగా.. ఈ సినిమాకు 15 కోట్ల షేర్ రాలేదు. ఉత్తరాంధ్రతో పాటు ఓవర్సీస్, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు తక్కువ నష్టాలు వచ్చాయి. ఓవరాల్ గా వీర సింహా రెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువ నష్టాలను తెచ్చుకుని విజయవంతమైన సినిమాగా నిలిచింది.

READ  Veera Simha Reddy: తొలి రోజు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ స్టార్ట్ పొందిన వీరసింహారెడ్డి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories