నాని దసరా విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది మరియు ప్యాన్-ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పనితీరు పై నిర్మాతలు గట్టి నమ్మకంగా ఉన్నారు. హీరో నాని అయితే ఈ చిత్రం పై చాలా నమ్మకంగా ఉన్నారు మరియు తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం దసరా టీమ్ 29న ఎంపిక చేసిన కొన్ని స్క్రీన్‌లలో అర్ధరాత్రి ప్రీమియర్‌లను మరియు విడుదల రోజు ఉదయం 5 గంటల నుండి పెద్ద హీరోల స్థాయిలో ఎర్లీ మార్నింగ్ షోలను ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 36 కట్స్ వచ్చాయి. అయినప్పటికీ, దసరా బృందం సినిమా విజయం మరియు అవుట్‌పుట్ పై అంతే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.
ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వాహబ్, సాయి కుమార్ మరియు రాజశేఖర్ అనింగి నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.