ఈ వారం రైటర్ పద్మభూషణ్, బుట్టబొమ్మ, మైఖేల్ రూపంలో మూడు కొత్త సినిమాలు విడుదలయ్యాయి. కాగా రైటర్ పద్మభూషణ్ సినిమా అందరి హృదయాలను గెలుచుకుని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుండగా, మిగతా రెండు సినిమాలకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది.
సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో మంచి పబ్లిసిటీతో వచ్చిన మైఖేల్, అర్జున్ దాస్, అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట నటించిన బుట్టబొమ్మ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూశాయి.
మంచి తారాగణం, ట్రైలర్ కారణంగా మైఖేల్ సినిమా చాలా మంచి అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాతో సందీప్ కిషన్ కమ్ బ్యాక్ హిట్ కొడతారని అందరూ ఆశించగా.. తొలి ఆట నుంచే టాక్ ఘోరంగా ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది మరియు బుట్టబొమ్మకు కూడా అదే పరాభవం ఎదురయింది. ఈ సినిమా కూడా వాష్ అవుట్ అయింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.
సందీప్ కిషన్ మైఖేల్ లో గౌతమ్ మీనన్, అనసూయ, వరుణ్ సందేశ్ లతో పాటు విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ అతిధి పాత్రలలో నటించిన మైఖేల్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్ అయింది. కానీ ఏ ఒక్క చోటా సినిమాకి సానుకూల స్పందన రాలేదు.
మరో వైపు బుట్టబొమ్మ 2020లో విడుదలైన మలయాళ హిట్ కప్పెలాకు రీమేక్ గా తెరకెక్కింది. పరస్పరం ఎప్పుడూ కలవని ఒక ఆటోడ్రైవర్, పల్లెటూరి అమ్మాయికి మధ్య జరిగే ఫోన్ కాల్ రొమాన్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. వారి జీవితం లోకి మరో వ్యక్తి ప్రవేశించినపుడు ఎదురైన సంఘటనల సమాహారం ఏ మిగిలిన కథ.