Homeసినిమా వార్తలుMeter: మీటర్ సినిమా బయ్యర్లకు 100 శాతం నష్టాలు

Meter: మీటర్ సినిమా బయ్యర్లకు 100 శాతం నష్టాలు

- Advertisement -

పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం మీటర్ గత శుక్రవారం ప్రేక్షకుల చక్కని అంచనాల మధ్య విడుదలైంది. ఈ యువ హీరో నటించిన గత చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది. అందుకే ప్రేక్షకులు ఈ మీటర్ సినిమా పై మంచి అంచనాలు పెట్టుకున్నారు కానీ దురదృష్టవశాత్తు ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరమైన కలెక్షన్లతో ప్రారంభమైంది మరియు ప్రేక్షకుల నుండి టాక్ కూడా భయంకరంగా ఉండటంతో తరువాత షో యొక్క కలెక్షన్లు కూడా పెరగలేదు. చాలా స్టేషన్లు మొదటి డెఫిషిట్ లు నమోదు చేయటంతో ఇక ఈ చిత్రం పూర్తిగా డిజాస్టర్ అయ్యే మార్గంలో ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

ఓపెనింగ్ డే ఘోరమైన వసూళ్లను చవిచూసిన ఈ సినిమా వీకెండ్ లో ఇంకా పతనమై థియేటర్ల యజమానులు అద్దెలు కూడా వసూలు చేయలేని స్థాయిలో భారీ డ్రాప్ ను చవిచూసింది.

READ  Hanuman: విడుదల తేదీ వాయిదా వేసే యోచనలో హనుమాన్ యూనిట్?

ఆ రకంగా సినిమా క్లోజింగ్ షేర్ సున్నా అంటే బయ్యర్లకు 100% నష్టం తెచ్చిపెట్టింది అన్నమాట.ఈ చిత్రానికి రమేష్ కడూరి దర్శకత్వం వహించగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మీటర్ సినిమాలో హీరో పోలీస్ పాత్రలో నటించారు. కాగా కిరణ్ అబ్బవరం సరసన అతుల్య రవి హీరోయిన్ గా నటించారు.

మీటర్ ఫలితం స్క్రిప్ట్ ల ఎంపిక విషయంలో హీరో కిరణ్ అబ్బవరానికి చెడ్డపేరు తెచ్చింది. ముఖ్యంగా తన తదుపరి ప్రాజెక్టులను ఆయన జాగ్రత్తగా ఎంచుకుంటే బాగుంటుందని, లేదంటే తన కెరీర్ కు ఎదురుదెబ్బ తగులుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మైత్రీ లాంటి పేరున్న బ్యానర్ మీటర్ వంటి అర్థంపర్థం లేని చెత్త సినిమాను నిర్మించడం కూడా ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించింది. తమ బ్యానర్ లో ఇలాంటి సినిమా చేయడానికి కారణాలు, నిబంధనలు ఏంటో తెలియదు కానీ మైత్రి మూవీస్ ఈ తరహా కంటెంట్ తో వస్తుందని ప్రేక్షకులు ఊహించలేదు. ఇలాంటి పొరపాట్లు వారి బ్యానర్ ఇమేజ్ ను దెబ్బతీస్తాయని ప్రేక్షకులు అంటున్నారు.

READ  Kantara: రెండు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలవుతున్న కాంతార.. వర్కవుట్ అవుతుందా?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories