మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా ప్రస్తుతం యువ దర్శికుడు మల్లిడి విశిష్ట తెరక్కిస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. యువి క్రియేషన్ సంస్థ పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి.
ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న విశ్వంభర మూవీ వాస్తవానికి మే 9ను రిలీజ్ అవుతుందని ఇటీవల మేకర్స్ అఫీషియల్ డేట్ అనౌన్స్ చేశారు. కాగా ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ లో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ పై కొన్ని విమర్శలు ఎదురయ్యాయి.
దానితో సినిమా యొక్క విఎఫ్ఎక్స్ పై మరింత గట్టిగా దృష్టి పెట్టారు టీం. మరో వైపు సినిమా యొక్క షూటింగ్ వేగవంతంగా జరుగుతున్నప్పటికీ విఎఫ్ఎక్స్ కి సంబంధించి మరికొంత సమయం పడుతుందని కావున సినిమాని ఈ ఏడాది జులై కి వాయిదా వేసినట్టు చెప్తున్నారు.
అయితే దీనికి సంబంధించి విశ్వంభర మూవీ టీం నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ మాత్రం రావాల్సి ఉంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి భీమవరం బుల్లబ్బాయి పాత్ర చేస్తున్నారు.