Home సినిమా వార్తలు Megastar Sandeep Reddy Vanga Movie మెగాస్టార్ తో సందీప్ రెడ్డి వంగా మూవీ ?

Megastar Sandeep Reddy Vanga Movie మెగాస్టార్ తో సందీప్ రెడ్డి వంగా మూవీ ?

chiranjeevi sandeep reddy

ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ తో తీసిన అనిమల్ మూవీతో అతి పెద్ద సంచలన విజయం సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు సందీప్. ఈమూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు మెగాస్టార్.

యువి క్రియేషన్స సంత నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ ప్రాజక్ట్ ని 2025 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, త్వరలో మెగాస్టార్ తో సందీప్ రెడ్డి వంగా ఒక మూవీ చేయనున్నారని, ఇటీవల సందీప్ చెప్పిన ఒక స్టోరీ లైన్ కు మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్.

త్వరలో ఈ మూవీ గురించి పూర్తి వివరాలు వెల్లడవుతాయని టాక్. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై క్లారిటీ రావాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version