టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సోషియా ఫాంటసీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది.
ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ మే 9 నుండి జూలైకు వాయిదా పడినట్లు చెప్తున్నారు. మరోవైపు విశ్వంభరకు సంబంధించి తాజాగా ఒక సాంగ్ ని గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు టీం సభ్యులు.
అయితే మ్యాటర్ ఏమిటంటే ఈ సాంగ్ లో మెగా సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ కొన్ని క్షణాల పాటు ఒక క్యామియో పాత్రలో కనిపించనున్నారు. అలానే నిహారిక కొణిదల కూడా కొన్ని క్షణాలు ఒక చిన్న పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ మరింతగా ఆకట్టుకునేలా దర్శకుడు వశిష్ట ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్. అలానే విఎఫ్ఎక్స్ పరంగా కూడా ఈ సినిమా విషయమై మరింత జాగ్రత్త తీసుకుంటున్నారట. మరి రిలీజ్ అనంతరం విశ్వంభర ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.