టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 యొక్క ప్రీమియర్ డిసెంబర్ 4న ఏర్పాటు చేసారు. కాగా ఆ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్లి అక్కడ ప్రీమియర్ చూసారు అల్లు అర్జున్. అయితే అదే సమయంలో థియేటర్ ఆవరణలో భారీ తొక్కిసలాట జరిగింది.
కాగా ఆ ఘటనతో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా మారింది. కాగా ఆ ఘటన వలన సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. కాగా ఆ ఘటన కారణంగా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ని ఆయన ఇంటివద్ద అరెస్ట్ చేసారు చిక్కడపల్లి పోలీసులు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తో టోటల్ టాలీవుడ్ మొత్తం షాక్ అయింది. కొద్దిసేపటి క్రితం నిర్మాత దిల్ రాజు చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకోగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన షూటింగ్ ని ఆపి మరీ పోలీస్ స్టేషన్ కి పయనమయ్యారట.
ఇప్పటికే చిరంజీవి దారిలో ఉన్నారని, పరిస్థితిని పోలీసులు, లాయర్లు తో మాట్లాడి అల్లు అర్జున్ కు మెగాస్టార్ తనవంతు మద్దతు అందించేందుకు సిద్దమయ్యారట. మొత్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.