Homeసినిమా వార్తలుకన్ఫ్యూజన్ లో మెగాస్టార్ చిరంజీవి

కన్ఫ్యూజన్ లో మెగాస్టార్ చిరంజీవి

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటించి ఈ ఏప్రిల్ లో విడుదలైన ఆచార్య చిత్రం అందరి ఆంచనాలను తలకిందులు చేస్తూ పెద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆర్ ఆర్ ఆర్ తరువాత రామ్ చరణ్ కనిపించే సినిమా, పైగా కొరటాల శివ లాంటి మంచి ఇమేజ్ ఉన్న దర్శకుడు అవడంతో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అటు మెగా అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు ఆశించగా ఆచార్య మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది.

అంతలో భారీ వైఫల్యం తరువాత తదుపరి చేయబోయే సినిమాల పై చిరంజీవి కాస్త ఆగి ఆలోచించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న చిరంజీవి సినిమాలు మూడు. ఒకటి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం “వేదాళం” రీమేక్”భోళా శంకర్” కాగా రెండోది మలయాళ చిత్రం “లుసిఫర్” రీమేక్ “గాడ్ ఫాదర్” . మూడో సినిమాకిబాబీ దర్శకుడు, ఈ చిత్రానికి ఇంకా అధికారంగా పేరు ప్రకటించలేదు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ మాత్రం చక్కర్లు కొడుతుంది.

READ  లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి

ఓటిటి ల కాలంలో ఇంకా ఈ రీమేక్ లు ఏంటని ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా అభిప్రాయ పడుతున్న మాట వాస్తవమే. అందుకే ఇప్పుడు ఈ రెండు రీమేక్ లను విడుదల చేస్తే ఆడతాయా లేదా అన్న సందిగ్ధంలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. గాడ్ ఫాదర్ అయితే షూటింగ్ దాదాపు అయిపొయింది, ఈ చిత్రం ఆగస్ట్ లేదా దసరా కానుకగా విడుదల కావచ్చని వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ముందుగా బాబీ సినిమానే రిలీజ్ చేసినా తరువాత రీమేక్ సినిమాలను రిలీజ్ చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు తెలుస్తుంది.ఏదైనా పెద్ద హీరోలకు ఊహించని పరాజయాలు ఎదురైనప్పుడు ఇలాంటి ఊహాగానాలు కాస్త ఎక్కువగానే వినిపిస్తుంటాయి. కాబట్టి ఏ విషయం అయినా అధికారికంగా ప్రకటన వచ్చే వరకు నమ్మడానికి లేదు.

Follow on Google News Follow on Whatsapp

READ  భారీ డిజాస్టర్ గా నిలిచిన అంటే సుందరానికీ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories