Homeసినిమా వార్తలుChiranjeevi: నందమూరి అభిమానులకు ఆగ్రహం తెప్పించిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

Chiranjeevi: నందమూరి అభిమానులకు ఆగ్రహం తెప్పించిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం రాత్రి చేసిన ట్వీట్ ఒక కొత్త వివాదానికి తెరలేపింది. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ క్యారెక్టరైజేషన్ ను హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రశంసిస్తూ వివరించి చెప్పిన ఒక వీడియోని ఆయన ట్వీట్ చేశారు.

అయితే జేమ్స్ కామెరూన్ వీడియో గత కొన్ని రోజులుగా పబ్లిక్ డొమైన్ లో ఉండడంతో ఈ ట్వీట్ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియోని చిరంజీవి ఇప్పుడే చూశారా అని నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. దానికి తోడు నందమూరి అభిమానులు కూడా చిరంజీవి ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్ ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్ లేదా ఆర్ఆర్ఆర్ సినిమా నుండి మరే ఇతర సాంకేతిక నిపుణుల గురించీ మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్ లో ప్రస్తావించకపోవడం నందమూరి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఆయన నుంచి ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం సమంజసం కాదని అంటున్నారు. అయితే ఈ వివాదానికి మెగా అభిమానుల నుంచి మరో వెర్షన్ కూడా ఉంది.

READ  Rajamouli: మహేష్ తో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ మూవీ అని కన్ఫర్మ్ చేసిన రాజమౌళి

రామ్ పాత్రను జేమ్స్ కామెరూన్ ప్రశంసించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఎవరూ షేర్ చేయలేదు. నిజానికి రాజమౌళి కూడా ఆ వీడియోని షేర్ చేయడం లేదా స్పందించడం లాంటిది ఏమీ చేయలేదని మెగా అభిమానులు అంటున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆర్ఆర్ఆర్ మూవీ అఫీషియల్ హ్యాండిల్ కూడా ఈ వీడియోను ప్రస్తావించలేదు. కాబట్టి ఒక తండ్రిగా చిరంజీవి ఈ వీడియోను షేర్ చేయడం సమంజసమేనని మెగా అభిమానులు అంటున్నారు.

రామరాజు క్యారెక్టరైజేషన్ వెనుక కారణం, బ్రెయిన్ మాస్టర్ డైరెక్టర్ రాజమౌళిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ పైన చెప్పినట్లు జేమ్స్ కామెరూన్ వీడియో పై ఆర్ఆర్ఆర్ యూనిట్ మౌనం కూడా ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఈ వీడియో పై వారు త్వరగా స్పందించి ఉంటే ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండేది కాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow on Google News Follow on Whatsapp

READ  Bhola Shankar: భోళా శంకర్ మేకర్స్ కు పెద్ద ప్లస్ గా మారిన వాల్తేరు వీరయ్య సక్సెస్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories