Homeసినిమా వార్తలుగరికపాటి పై మెగాస్టార్ పంచ్

గరికపాటి పై మెగాస్టార్ పంచ్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తన నటనా ప్రతిభకు మాత్రమే కాకుండా, అద్భుతమైన డ్యాన్స్‌లు మరియు ఫైట్‌లకు కూడా గొప్ప పేరును కలిగి ఉన్నారు, ఇక ఆయన కామెడీ టైమింగ్‌కు ఎంతో మంది ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. సినిమాల్లోని డైలాగులే కాదు, బయట కూడా కొన్ని సందర్భానికి అనుకూలంగా ఆయన వేసే పంచ్ లు కూడా ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి.

తాజాగా ఆయన సినీ జర్నలిస్టు ప్రభు రచించిన ‘శూన్యం నుండి శిఖరాగ్రం వరకు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి రాకతో ఈ బుక్ రిలీజ్ ఫంక్షన్ ఒక భారీ వేడుకగా మారింది.

చిరంజీవి లాంటి పెద్ద స్టార్ ఏ ఫంక్షన్ కి హాజరైనా ఆయన చుట్టూ క్రేజ్ ఉండడం సహజం. కాబట్టి సహజంగా ఆయనను చూసి అందరూ ఆయనతో ఫోటో దిగేందుకు వేదిక పైకి వచ్చారు. చిరంజీవి సంతోషంతో వారి అభ్యర్థనను అంగీకరించి వారితో ఫోటోలు దిగారు. కాగా చిరంజీవి ఫోటోలకు పోజు ఇస్తూ ‘ వారు ఇక్కడ లేరు కదా? అని అన్నారు.

ఆ వ్యక్తి పేరు ఏమిటో చిరు చెప్పక పోయినా, ఆయన ఉద్దేశించిన వ్యక్తి ఎవరో అక్కడ అందరికీ అర్థమైంది. గరికపాటి నరసింహారావు గారిని ఉద్దేశించే అలా అన్నారని ఆ వీడియో చూసిన వారికి కూడా అర్థం అవుతుంది. దీనికి కారణం తాజాగా చిరంజీవి – గరికపాటి మధ్య రగిలిన చిన్న వివాదమే.

ఇటీవలే బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలాయ్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక వక్త గరికపాటి నరసింహారావు కూడా హాజరై ప్రసంగిస్తుండగా కొందరు మహిళా అభిమానులు చిరంజీవితో ఫొటోలు దిగారు.

READ  హిందీలో విడుదల చేసుంటే జిన్నా 100 కోట్లు కలెక్ట్ చేసేది - మంచు విష్ణు

ఆ సమయంలో చిరంజీవి ఆ ఫోటోలు తీయడం మానేసి వేదికపైకి వస్తేనే స్పీచ్ ఇస్తానని.. లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోతానని గరికపాటి కాస్త కోపంగా స్పందించారు.

ఈ విషయమై కొన్ని రోజులుగా రచ్చ జరిగింది. గరికపాటిని హెచ్చరిస్తూ మెగా ఫ్యాన్స్ వీడియోలు కూడా చేశారు. ఈ విషయం పై గరికపాటి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఇదే విషయం పై చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఆయన చేసిన పనిని ఎవరైనా తప్పుగా పొరపాటు పడితే అందుకి తాను చేసేదేమీ లేదని అన్నారు. అలాగే గరికపాటి అంటే తనకు గౌరవం, అలాంటి పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదం చేయకూడదని అన్నారు.

ఇప్పుడు ఈ పుస్తకం రిలీజ్ సందర్భంగా దాదాపు అదే తరహా పరిస్థితి ఏర్పడటంతో.. అది గుర్తుకు తెచ్చుకుని గరికపాటి పై పరోక్షంగా పంచ్ వేశారు. చిరు టైమింగ్‌, కామెడీ సెన్స్‌ పై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం ఇది అనవసరం అని, సమసిపోయిన వివాదాన్ని మళ్ళీ రేపడం ఎందుకని అభిప్రాయపడ్డారు.

Follow on Google News Follow on Whatsapp

READ  డిజె టిల్లు సీక్వెల్ లో హీరోయిన్ మార్పు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories