Homeసినిమా వార్తలుమూడు పండగలకు మూడు సినిమాలు అంటున్న మెగాస్టార్

మూడు పండగలకు మూడు సినిమాలు అంటున్న మెగాస్టార్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఇక ప్రస్తుతం మెగా అభిమానులందరూ మెగాస్టార్ తదుపరి సినిమాల పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ అనే సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నారు అని వినికిడి,అలాగే ఒరిజినల్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. చిరంజీవి,సల్మాన్ ఖాన్ పై ఒక అద్భుతమైన డాన్స్ నంబర్ సినిమాలో ఉంటుంది అని గట్టి ప్రచారం జరిగింది, అయితే ఆ పాటకు సంభందించిన షూటింగ్ ఇంకా జరగలేదు.

ఇక మరో సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో రానున్న భోళా శంకర్. ఇది తమిళ చిత్రం వేదాలమ్ (2015) కి రీమేక్. ఇందులో హీరోయిన్ గా తమన్నా, చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు.మరో చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా. అధికారికంగా ఈ చిత్రానికి టైటిల్ ఏదీ ఖరారు కానప్పటికీ “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ ప్రచారంలో ఉంది.ఈ మూడు సినిమాల్లో దాదాపు షూటింగ్ అంతా పూర్తి అయిన సినిమా గాడ్ ఫాదర్, ముందుగా చెప్పుకున్నట్టు కేవలం ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది. ఇక భోళా శంకర్, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు కూడా యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.

READ  కొత్త పుంతలు తొక్కుతున్న తెలుగు సినిమా పబ్లిసిటీ

ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే వీటిలో గాడ్ ఫాదర్ మొదటి సినిమాగా రిలీజ్ అయి, సంక్రాంతికి భోళా శంకర్, ఆ తరువాత వేసవి కాలంలో వాల్తేరు వీరయ్య రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని వినిపించింది.అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం తన ఆలోచనలు చిరంజీవి మార్చుకున్నట్లు తెలుస్తుంది. స్ట్రెయిట్ సినిమా అయిన వాల్తేరు వీరయ్య ను దసరా కానుకగా విడుదల చేసి, గాడ్ ఫాదర్ ను సంక్రాంతికి, ఆ పై ఉగాదికి భోళా శంకర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇవేవీ కూడా అధికారికంగా ప్రకటించలేదు, వీటిలో మళ్ళీ ఒక సినిమా అటు ఒక సినిమా ఇటు అయ్యే అవకాశాలూ లేకపోలేదు అంటున్నారు. మరి మెగాస్టార్ తన అభిమానులకి ఏ పండగకి ఏ సినిమా అందిస్తారో తొందరలోనే తేలిపోతుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ లకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories