Homeసినిమా వార్తలుమలయాళంలోనూ విడుదల కానున్న గాడ్ ఫాదర్.. అందరినీ ఆశ్చర్యపరిచిన మెగాస్టార్

మలయాళంలోనూ విడుదల కానున్న గాడ్ ఫాదర్.. అందరినీ ఆశ్చర్యపరిచిన మెగాస్టార్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించగా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా గాడ్ ఫాదర్. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్టోబర్ 5న భారీ స్థాయిలో విడుదల అయ్యేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో మేటి నటి నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా.. సల్మాన్ ఖాన్ ఒక ముఖ్య అతిధి పాత్రలో కూడా నటించనుండటం విశేషం. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దసరా పండుగ సమయంలో విడుదల అవడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద ప్రయోజనం చేకూరనుంది.

ఇక ఈ సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో చిరంజీవి తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈరోజు చేసిన ప్రకటన ప్రకారం గాడ్ ఫాదర్ మలయాళంలోనూ విడుదల కానుంది. చిరంజీవి రీమేక్ చేస్తున్న ఈ చిత్రానికి మాతృక.. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్‌ అనేది అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్న అతిధి పాత్రలో కూడా నటించారు. ఆ పాత్రనే తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు.

అయితే ఇలా ఒరిజినల్ సినిమా ఆల్రెడీ సిద్ధంగా ఉన్న దగ్గర రీమేక్‌ని విడుదల చేయాలనే నిర్ణయం చాలా మందిని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తోంది. లూసిఫర్ సినిమా అవడానికి మాస్ సినిమా అయినా.. సహజంగా మలయాళ సినిమాల్లో ఉండే నెమ్మదితనం నిండుగా ఉన్న సినిమా.. అక్కడి ప్రేక్షకులకి అలా ఉంటేనే సినిమాలు నచ్చుతాయి.

READ  నాగార్జున - మహేష్ కాంబినేషన్లో సినిమా రానుందా?

మరి వారి అభిరుచులకు చాలా దూరంగా.. మాస్ మరియు కమర్షియల్ వెర్షన్‌ లా తయారు చేయబడిన గాడ్ ఫాదర్ సినిమాని చూసి మలయాళ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అనేది చూడాలి. ట్రోల్ అవుతాము ఏమో అని మెగా అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

ఇక ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ సినిమా పై చాలా పాజిటివ్ బజ్ నడుస్తోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు మోహన్ రాజా చక్కని మార్పులు చేశారని ఇండస్ట్రీ లోని అంతర్గత వర్గాలు మంచి ప్రశంసలు ఇస్తున్నారు. క్లాస్ మాస్ ఇలా అందరూ ఎంజాయ్ చేసే కమర్షియల్ అంశాలు జోడించారని చెబుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp

READ  యూట్యూబ్ ఛానళ్ల పై కేసు పెట్టనున్న సమంత


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories