మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. చిరు 153వ చిత్రంగా వస్తున్న గాడ్ ఫాదర్ నుంచి ఫస్ట్ లుక్ అప్ డేట్ అందించారు చిత్ర యూనిట్. జులై 4న సాయంత్రం 5:45న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.రోమాలు నిక్కబొడుచుకునే చిత్రం సిద్ధం అంటూ అభిమానులను ఉద్దేశించి చిత్ర బృందం ట్వీట్ చేశారు.
.హనుమాన్ జంక్షన్ ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తెలుగు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే చిరంజీవితో కలిసి దిగిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్ అదిరిపోయే లెవెల్ లో ఉందని చెప్పాలి.అలాగే మినీ టీజర్ లాగా ఉన్న కార్ షాట్ లో కూడా చిరంజీవిని బాగా ప్రెజెంట్ చేశారు.. తమన్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది.ఇక ఈ టీజర్ లో చిరంజీవి పక్కన సునీల్ కూడా కనిపించారు.
చిరంజీవి గాడ్ ఫాదర్ తో పాటు మెహర్ రమేష్ తో వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. కీర్తిసురేష్ చెల్లెలి పాత్రలో నటిస్తోంది. మరోవైపు కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో 154వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.