మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని భావోద్వేగ మాటలని పంచుకున్నారు. అలాగే ఆయన తన శత్రువుల గురించి మాట్లాడారు మరియు తన ఫిట్నెస్ రహస్యాలను కూడా వెల్లడించారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని చిరంజీవి ప్రశంసించారు. పవన్ పై తనకు ఎంత ప్రేమ ఉందో వెల్లడించారు. మొన్నటి వరకు పవన్ కు సొంత ఇల్లు కూడా లేదని ఆయన వెల్లడించారు.
పవన్ తనకు బిడ్డ లాంటివాడని చిరంజీవి అన్నారు. పవన్ ను తన చేతులతోనే ఎత్తుకున్నానని వివరించారు. తాను, తన భార్య సురేఖ పవన్ కళ్యాణ్ కు తల్లిదండ్రులు లాంటివాళ్లమని చెప్పారు. అంతేకాదు పవన్ కు స్వార్థం, డబ్బు, హోదా పై ఎలాంటి కోరిక లేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ ఎప్పుడూ తన గురించి ఆలోచించరని ఆయన అన్నారు.
పవన్ కు అన్నయ్యగా కాకుండా దగ్గరగా చూసిన ఒక వ్యక్తిగా తాను ఈ మాట చెబుతున్నానని చిరంజీవి అన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు పవన్ కు సొంత ఇల్లు లేదు. పవన్ సరైన దుస్తులు ధరించరని, సమయానికి తగిన విధంగా భోజనం చేయరని చిరంజీవి అన్నారు.
సమాజం కోసం ఏదైనా చేయాలనే తపనతో అన్నింటినీ విడిచిపెట్టిన యోగి పవన్ అని చిరంజీవి అభివర్ణించారు. ఇక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పై కొందరు అతిగా మాట్లాడితే బాధ కలుగుతుందన్నారు.
పవన్ కళ్యాణ్ ను అవమానించిన వ్యక్తులు తన వద్దకు వచ్చి తనను పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ఆహ్వానిస్తే చాలా బాధగా ఉంటుందని చిరంజీవి అన్నారు. ఆ సమయంలో.. తన సోదరుడికి వ్యతిరేకంగా, తప్పుగా వ్యాఖ్యానించిన వ్యక్తులను కలుస్తున్నందుకు బాధపడతానని ఆయన తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి తన ఫిట్ నెస్ సీక్రెట్ ను బయటపెట్టారు. మీరు ఫిట్ గా కనిపించాలనుకుంటే, అది ఆహారం మరియు వ్యాయామంతో మాత్రమే సాధ్యం కాదని ఆయన అన్నారు. ఖైదీ నెం.150 సినిమాకు ముందు తన మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉండేదని, అయితే ఆ సినిమా తర్వాత తన మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉందని చెప్పారు.