Homeసినిమా వార్తలుOTT డీల్స్ తో దుమ్మురేపుతున్న మెగాస్టార్ చిరంజీవి

OTT డీల్స్ తో దుమ్మురేపుతున్న మెగాస్టార్ చిరంజీవి

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న స్థానం.. జీరో నుంచి మొదలై నంబర్ వన్ గా ఎదిగిన ఆయన ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒక నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను తనదైన శైలిలో రక్తి కట్టించడంతో పాటు, బాక్స్ ఆఫీసు వద్ద కూడా ఎన్నో రికార్డులను తిరగరాసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

దాదాపు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ కాలం సినిమా పరిశ్రమలో ఉన్న చిరంజీవి , 2007లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పదేళ్ల గ్యాప్ తరువాత 2017లో ఖైదీ నంబర్ 150 సినిమాతో తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టి, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు.

ఆ తర్వాత సై రా నరసింహా రెడ్డి చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయినా.. ఆయన స్టార్డంను ఎవరూ ప్రశ్నించలేదు. కానీ ఈ ఏడాది వేసవి కాలంలో వచ్చి డిజాస్టర్ గా నిలిచిన ఆచార్య సినిమాతో ఆయన మీద విమర్శలు వచ్చాయి. ఇక ఆయన టైం అయిపోయింది అని.. మళ్ళీ ఆయన మునుపటిలా సూపర్ హిట్ సినిమాలను అందించలేరని కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఆ విమర్శలు అన్నీ తప్పని, మెగాస్టార్ ఇమేజ్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఇటీవలే రెండు ఉదాంతాలతో రుజువైంది.

READ  కమ్ బ్యాక్ హిట్ కోసం కొడుకుతో సినిమా తీయనున్న పూరి

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా గాడ్ ఫాదర్. ఇటివలే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ సంస్థ 57 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ 50 కోట్ల మొత్తాన్ని చెల్లించిందని తెలుస్తోంది. రెండు సినిమాలు కూడా అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతాయట.

ఇలా వరుసగా భారీ ఆఫర్లతో మెగాస్టార్ చిరంజీవి సినిమాలను కొనడం చూస్తుంటే ఆయన మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ రేసులో దూసుకుపోతున్నారనే అర్థం అవుతుంది. ఇక రెండు చిత్రాలు సరైన కంటెంట్ అందిస్తే కలెక్షన్లు కూడా రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

READ  "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం నుండి "చాలాబాగుందే" లిరికల్ వీడియో విడుదల

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories