Homeసినిమా వార్తలువాల్తేరు వీరయ్యతో మళ్లీ 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడంలో విఫలమయిన మెగాస్టార్ చిరంజీవి

వాల్తేరు వీరయ్యతో మళ్లీ 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడంలో విఫలమయిన మెగాస్టార్ చిరంజీవి

- Advertisement -

3 దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్‌కు తిరుగులేని బొనాంజాగా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఈ రోజుల్లో, ఆయన ఇటీవలి ఫ్లాప్ సినిమాల వల్లో.. లేదా వయస్సు పై బడటం కారణంగానో, ఆయన సినిమా మార్కెట్‌లో వెనక్కి తగ్గుతున్నారు.

స్టార్ హీరోల సినిమాలకు ఆనవాయితీగా వస్తున్న 100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌ మార్కును చేరుకోవడానికి చిరంజీవి సినిమాలు చాలా కష్టపడుతున్నాయి. 130 కోట్ల థియేట్రికల్ బిజినెస్ డీల్ పొందిన ఆచార్యతో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల అని చెప్పాలి. అయితే స్టార్ గా చిరంజీవి పతనానికి ఆచార్య దారుణమైన ఫెయిల్యూర్ కూడా ఒక బలమైన కారణమని అంటున్నారు.

ప్రస్తుత తరం సూపర్ స్టార్లు చాలా సులువుగా క్రేజీ డీల్స్ పొందుతున్నారు. అంతే కాక సులభంగా 100 కోట్ల మార్క్‌ను దాటుతున్నారు. చిరు కూడా మార్కెట్‌లో అలాంటి క్రేజ్‌ను ఎంజాయ్ చేసేవారు, అయితే ఆచార్య పరాజయంతో అంతా ఒక్కసారిగా మారిపోయింది.

READ  మోహన్ లాల్ లూసిఫర్ కలెక్షన్లను దాటలేక పోయిన చిరంజీవి గాడ్ ఫాదర్

అప్పటి నుండి చిరంజీవి సినిమాలకు మార్కెట్ డిమాండ్ తగ్గిపోయింది. గాడ్‌ఫాదర్‌కు మంచి డీల్స్ రాలేదు. చేసేది లేక ఆ చిత్ర నిర్మాతలు సినిమాకి సొంతంగా విడుదల చేశారు. ఈ మోస్తరు ప్రతిస్పందనను కొనసాగిస్తూ, మెగాస్టార్ తాజాగా సిద్ధం చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకి 100 కోట్ల ఒప్పందాలను పొందడంలో విఫలమయ్యారు.

కాగా వాల్తేరు వీరయ్య సినిమా సీడెడ్ హక్కులు 15 కోట్లకు అమ్ముడయ్యాయి. ఆంధ్రా ప్రాంతం 42 కోట్లు, నైజాం విలువ 22 కోట్ల రూపాయలకు ఒప్పందాలు కుదిరాయి. తెలుగు రాష్ట్రాల వ్యాపారం సుమారు 79 కోట్లు అవగా.. ROI మరియు ఓవర్సీస్ దాదాపు 16 కోట్లు ఉంటుంది. మొత్తం వ్యాపారం సుమారు 95 కోట్లకు జరిగింది.

ఇది చూసి తమ అభిమాన హీరో ఈ సినిమాతో తిరిగి బాక్సాఫీసు వద్ద తన కీర్తిని తిరిగి పొందుతాడని భావించిన చిరంజీవి అభిమానులు ఈ వ్యాపారంతో ఒకింత నిరాశకు గురయ్యారనే చెప్పాలి.

అలాగే, పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజా రవితేజ ముఖ్యమైన పాత్రలో నటిస్తుండటం.. శృతి హాసన్ కథానాయికగా చేయడం మరియు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం వంటి అదనపు ఆకర్షణలు ఉన్నా కూడా సినిమా 100 కోట్ల బిజినెస్ జరుపుకోలేక పోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

READ  ఈ వారం తెలుగు సినిమాల ఫస్ట్ డే ఫస్ట్ షో రిపోర్ట్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories