టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు మల్లి విశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా గ్రాండ్ లెవెల్ రూపొందుతున్న ఈ సినిమా మేలో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక దీని తర్వాత త్వరలో యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయనున్నారు మెగాస్టార్.
సాహు గారపాటి నిర్మాతగా గ్రాండ్ లెవెల్ లో రూపొందనున్న ఈ సినిమాపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి ఇటీవల అనిల్ రావిపూడి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారిని అన్ని వర్గాల ఆడియన్స్ కోరుకునే విధంగా అలానే తన స్టైల్లో అద్భుతంగా చూపించేలా ఒక స్క్రిప్ట్ రెడీ చేయబోతున్నట్టు చెప్పారు.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో ప్రారంభమై 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. కాగా త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడి కానున్నాయని చెప్తున్నారు.
తన మార్కు కామెడీతో పాటు మెగాస్టార్ చిరంజీవి మార్క్ స్టైల్ లో సాగే మంచి యాక్షన్ సీన్స్ ఉండేలా పక్కాగా దర్శకుడు అనిల్ దీని యొక్క స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. మొత్తంగా తొలిసారిగా అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ఎంతమేర విజయం అందుకుంటుందో తెలియాలి అంటే రాబోయే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.