మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు ఇంకా రెండు వారాల దూరంలో ఉంది మరియు రోజురోజుకు ఈ సినిమా పై అభిమానుల అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో రవితేజ 40 నిమిషాల పాటు పొడిగించిన అతిధి పాత్రలో కనిపించనున్నారు మరియు ఇటీవల విడుదలైన ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్’ అనే పాటలో మెగాస్టార్ మరియు మాస్ మహారాజా ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు.
కాగా వాల్తేరు వీరయ్య ఔట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి ఒక అండర్ కవర్ కాప్‌గా కనిపిస్తారని, ఇంటర్వెల్‌లో ఈ విషయాన్ని ఒక ట్విస్ట్ లా రివీల్ చేస్తారని ఒక ఆసక్తికరమైన పుకారు ప్రస్తుతం పరిశ్రమ వర్గాల్లో వ్యాపించింది.
ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ గన్‌లతో కనిపించిన కొన్ని స్టిల్స్ ఉన్నాయి. ఈ పోస్టర్లు ఈ పుకార్లకు దారితీశాయి మరి ఇవి నిజమో కాదో చూడాలి.
ఇక హీరో చిరంజీవి మాత్రం సినిమా అవుట్‌పుట్‌పై చాలా నమ్మకంగా ఉన్నారు మరియు ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో, మెగాస్టార్ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌లలో వాల్తేరు వీరయ్య ఒకటని, ఈ సినిమాలోని కామెడీ తన ఒకప్పటి సినిమా శంకర్ దాదా MBBS వంటి కామెడీ ఎంటర్‌టైనర్‌లతో సమానంగా ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే రవితేజ ఈ చిత్రంలో పోలీసు-ఏసీపీ విక్రమ్ సాగర్‌గా నటిస్తున్నారని మనకు తెలుసు. ఆ రకంగా చిరంజీవికి కూడా కొంత పోలీసు కనెక్షన్ ఉండే అవకాశం లేకపోలేదు.
వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కానుంది మరియు ఈ సినిమాలో శృతి హాసన్ మరియు కేథరిన్ త్రెసా కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించగా బాబీ దర్శకత్వం వహించారు.