Home సినిమా వార్తలు గాడ్ ఫాదర్ సినిమాకి ఫేక్ కలెక్షన్లు ప్రకటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

గాడ్ ఫాదర్ సినిమాకి ఫేక్ కలెక్షన్లు ప్రకటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి చివరిగా థియేటర్లలో విడుదల చేసిన గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. డీసెంట్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ మినహా కలెక్షన్లలో ఈ సినిమా పెద్దగా రాణించలేదు.

అయితే మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మొదటి రోజు నుంచి గాడ్‌ఫాదర్‌ టీమ్‌ ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా నిలిచిందని నిరూపించే ప్రయత్నంలో ఉంది. ఈ వేసవిలో విడుదలైన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే.

కాబట్టి ఇప్పుడు చిరంజీవి మరియు అతని కోర్ టీమ్ మెగాస్టార్‌కి గాడ్‌ఫాదర్ సినిమా ఒక పునరాగమనం హిట్ అని నిరూపించడానికి తెగ కష్టపడుతున్నారు. ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ అని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్నదాని కంటే నంబర్లు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. గాడ్‌ఫాదర్ ఫైనల్ గ్రాస్ కలెక్షన్స్ దాదాపు 100 కోట్లు అయితే రామ్ చరణ్ అంతకంటే ఎక్కువ నంబర్ ఇచ్చారు.

ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ సినిమా బాక్సాఫీస్ లెక్కలను బయటపెట్టాడు. OTTలో ఎక్కువ మంది వీక్షించినప్పటికీ సినిమాకు వసూళ్లు చాలా బాగా వచ్చాయని ఆయన అన్నారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.145 కోట్ల నుంచి రూ.150 కోట్లు వసూలు చేసిందని ఆయన తెలిపారు. ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్‌కి వన్ టు వన్ ఇంటర్వ్యూ సందర్భంగా చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

“అవును, OTTలో అసలు సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులలో పెద్ద భాగాన్ని కోల్పోతాము. ఒక రీమేక్‌ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇష్టపడకపోవచ్చు. బహుశా స్టార్ చరిష్మా, స్టార్ పవర్ వల్ల కొంత మంది ప్రేక్షక వర్గం మాత్రం సినిమా చూసినా మళ్లీ థియేటర్లకు లాగబడవచ్చు. అయితే ఆ ఫార్ములా ఎప్పుడూ పని చేస్తుందా అంటే? నేను కాదు అంటాను. నేను ఇక పై రీమేక్‌లు చేస్తానో లేదో నాకు తెలియదు” అని ఆయన అన్నారు.

చరణ్ ఇంకా మాట్లాడుతూ, “నేను గనక రీమేక్ చేస్తే, బహుశా ఒరిజినల్ నిర్మాతని OTTలో విడుదల చేయవద్దని కోరతాను. ఆ షరతులతో నేను రీమేక్ చేయవచ్చు. అది కూడా నేను థియేటర్లో సినిమా చూసి మరియు అది నాకు నచ్చినట్లయితేనే, OTTలో విడుదల చేయవద్దని నేను సదరు నిర్మాతను అభ్యర్థించవచ్చు. లేకపోతే, ఇక ముందు ముందు మనమందరం ఒరిజినల్ స్క్రిప్ట్‌లను చేయడానికే ఇష్టపడతాము.” అని చరణ్ అన్నారు.

రీమేక్‌లు ఇక పై సురక్షితం కాదని రామ్ చరణ్ తెలుసుకోవడం అభినందనీయం. కానీ సరైన సంఖ్యలతో బాక్సాఫీస్ స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం పై తను కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే బ్లోటెడ్ నంబర్‌లు ఇవ్వడం వల్ల ఆయనకి లేదా ఆయన చిత్రాలకు ఎటువంటి మేలు జరగదు, అది తను నటించే సినిమాలు కావచ్చు లేదా తను నిర్మిస్తున్న తన తండ్రి సినిమాలు అయినా కావచ్చు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version