తెలుగు సినిమా స్టార్ హీరోల్లో ఒకరైన గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని భారీ వ్యయంతో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ సక్సెస్ అందుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఎన్టీఆర్ దేవర పక్కాగా సక్సెస్ ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు. దానికి వారు ఒక ప్రధాన కారణం చెప్తున్నారు. గతంలో మెగా హీరోస్ తో మూవీస్ చేసి ప్లాప్స్ చవిచూసిన దర్శకులు ఆ వెంటనే ఎన్టీఆర్ తో మూవీ చేసి హిట్స్ కొట్టిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ వట్టి డిజాస్టర్ ని తీసిన బాబీ, ఆ తరువాత ఎన్టీఆర్ తో జైలవకుశ మూవీ తీసి హిట్ కొట్టారు.
అనంతరం పవన్ తోనే అజ్ఞాతవాసి రూపంలో భారీ డిజాస్టర్ తీసిన త్రివిక్రమ్ కూడా అనంతరం ఎన్టీఆర్ తో అరవింద సమేత రూపంలో హిట్ కొట్టారు. ఆ విధంగా చూస్తే ఇటీవల చిరు, చరణ్ లతో కొరటాల తీసిన ఆచార్య మూవీ ఫ్లాప్ అవడంతో, తాజాగా ఎన్టీఆర్ తో ఆయన తీస్తున్న దేవర పక్కాగా సక్సెస్ ఖాయం అంటున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.