2015లో హీరో రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అనుకున్న స్థాయిలో కంటెంట్ లేకపోవడం వల్ల సినిమా బాగా ఆడలేదు, ప్రేక్షకులు ఆ చిత్రాన్ని తిప్పి కొట్టారు.అయితే ఆ విషయం పక్కన పెడితే, ఈ సినిమాలో చిరంజీవి అతిధి పాత్రే అప్పట్లో ప్రధాన చర్చగా నిలిచింది. ఇండస్ట్రీకి రిటర్న్ వస్తున్న చిరంజీవి ఆ సమయంలో పూరి జగన్నాధ్‌తో ఓ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రూపు దాల్చలేదు.
సినిమా పరాజయం పాలవడంతో చిరంజీవి, రామ్ చరణ్ లను హేళన చేస్తూ అప్పట్లో ఛార్మీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అప్పట్లో సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ ట్వీట్ ను సీరియస్‌గా తీసుకుని శాడిస్ట్ ట్వీట్‌గా పరిగణించి కొట్టిపారేశారు కూడా.
కానీ 7 సంవత్సరాల తరువాత, ఈ ట్వీట్ మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. అది కూడా ఎవరూ ఊహించని రీతిలో. నిన్ననే, ఛార్మీ కౌర్ పూరి జగన్నాథ్ తో కలిసి సంయుక్తంగా నిర్మించిన లైగర్ సినిమా విడుదలైంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా దారుణమైన సమీక్షలను మరియు స్పందనను తెచ్చుకుంది. ఈ సినిమా అటు సామాన్య ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి చెత్త సినిమా అనే టాక్ ను అందుకుంది. ఓపెనింగ్ షోల వసూళ్లు భారీగా ఉన్నా.. ట్రెండ్ ను బట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా కుప్ప కూలిపోయే దారిలో నడుస్తుంది.
దీంతో మెగా అభిమానులు లైగర్ చిత్ర ఫలితం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఛాన్స్ దొరికింది అని ఛార్మీని లక్ష్యంగా చేసుకున్నారు. ట్రోల్స్ నాన్‌స్టాప్‌గా చేస్తూ.. ఛార్మీ అప్పట్లో వేసిన ట్వీట్ ను కోట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ” జీవితం ఎవ్వరినీ వదిలి పెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది” అని. ఇప్పుడు అదే పరిస్థితి పూరి.-. ఛార్మి లకు, మరియు లైగర్ చిత్ర బృందానికి ఉద్భవించింది.
కర్మ నిజంగానే ఎవ్వరినీ వదిలి పెట్టదు. అతి విశ్వాసం అన్ని వేళలా పనికి రాదు. లైగర్ చిత్ర ప్రచార సమయంలో చిత్ర బృందం భారీ స్టేట్మెంట్ లు ఇచ్చారు. విడుదలకు ముందు ఒక సందర్భంలో ఈ సినిమా అసలైన వసూళ్లను 200 కోట్ల నుండి లెక్కిస్తామని అన్నారు. అలాగే మరి కొన్ని అతి ధోరణిలో వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ వాస్తవం ఏమిటంటే, సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే వారు ఇంక కలెక్షన్లు లెక్కించాల్సిన అవసరం కానీ అవకాశం కానీ లేదు అనే చెప్పాలి.