Homeసినిమా వార్తలుతమ స్థాయిని అనవసరంగా ఎక్కువగా ఊహించుకుని కెరీర్ ను సరిగ్గా మలుచుకోలేక పోతున్న యువ దర్శకులు

తమ స్థాయిని అనవసరంగా ఎక్కువగా ఊహించుకుని కెరీర్ ను సరిగ్గా మలుచుకోలేక పోతున్న యువ దర్శకులు

- Advertisement -

చిన్న హీరోలతో మీడియం బడ్జెట్ సినిమాలు ఎక్కువగా సినిమాలు చేస్తూ.. అరుదుగా మాత్రమే స్టార్ హీరోలతో సినిమాలు తీసేవారిని తెలుగు సినీ పరిశ్రమలో టైర్ 2 డైరెక్టర్స్ అంటారు. ఎలాగైతే హీరోలకు చిన్న పెద్దా అనే పట్టికలు వేస్తారో, దర్శకులను కూడా అలాగే విభజిస్తారు. అలా చూసుకుంటే తెలుగులో ఒక డజనుకు పైగా టైర్ 2 డైరెక్టర్లు మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.

అయితే వారు సినిమా పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. స్టార్ హీరోల ఆమోదం కోసం కొన్నాళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ వైఖరి వారిని ఏళ్ల తరబడి ఏ పనీ లేకుండా ఖాళీగా కూర్చోబెడుతుంది. దీనికి కారణం వారి అహం లేదా లేని స్టార్‌డమ్ ను భ్రమించడం వల్ల కావచ్చు.

ఇలాంటి అనిశ్చితి వల్ల యువ దర్శకులు టైర్ 2 హీరోలతో సినిమాలు ఒప్పుకోకుండా సమయం వృధా చేస్తున్నారు. తొలి సినిమాతో చక్కని సూపర్ హిట్ అందించిన తర్వాత, వారి కళ్ళు స్టార్ హీరోల కోసం మాత్రమే చూస్తున్నాయి.

ఉప్పెన అనే మంచి సినిమాని అందించిన బుచ్చిబాబు లాంటి దర్శకుడు ఎన్టీఆర్ లేదా చరణ్ ఆమోదం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు. అయితే స్టార్ హీరోలు మాత్రం టాలీవుడ్‌కి చెందనటువంటి పెద్ద దర్శకులైన శంకర్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ లాంటి , అనుభవం ఉన్న దర్శకులతో  మాత్రమే పమి చేయాలని అనుకుంటున్నారు.

హరీష్ శంకర్, గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులతో పాటు తాజాగా బింబిసార వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ట, పరశురామ్ పెట్లా తదితరులు కూడా ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

READ  నిరాశ పరచిన సర్కారు వారి పాట టీఆర్పీ రేటింగ్స్

ఈ దర్శకులు అందరూ ఇంత కాలం ఉత్తినే ఎదురు చూడకుండా.. తమ స్థాయికి తగ్గట్టు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి మంచి కంటెంట్ ఇస్తే బాగుంటుంది కదా. అలా చేస్తే థియేటర్లకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి సీనియర్ దర్శకులు లేదా పూరి, రాజమౌళి లాంటి వారు కూడా చిన్న హీరోలతో సినిమాలు చేసేవారు. అలాగే ఆయా హీరోలతో పెద్ద హిట్‌లు కూడా సాధించారు. అది పరిశ్రమకు ఎంతో మంచి చేసింది.

ఈ యంగ్ మరియు మీడియం రేంజ్ దర్శకులు సీనియర్ దర్శకుల నుండి గుణపాఠం తీసుకొని పెద్ద బడ్జెట్ మరియు స్టార్ హీరోలు లేకుండా సినిమాలు చేయాలి.  సాధారణ ప్రేమకథలు లేదా వినోదాత్మక చిత్రాలను వారు చాలా సులభంగా రూపొందించగలరు. అలాగే ఆ సినిమాలు వారికి విజయాన్ని మరియు కీర్తిని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Thalapathy67: కాస్టింగ్ తోనే భారీ అంచనాలు పెంచేస్తున్న విజయ్ - లోకేష్ సినిమా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories