టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా మెకానిక్ రాఖీ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని యువ దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరేక్కించగా ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.
మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ఆశించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయింది. జెక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్, నరేష్, సునీల్, హైపర్ ఆది, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు చేసారు. కాగా విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డీటెయిల్స్ తాజాగా అనౌన్స్ అయ్యాయి.
కాగా ఈమూవీ ఓటిటి హక్కులని ప్రముఖ డిజిటల్ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 19న అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ మూవీ ఫెయిల్యూర్ తో నటుడిగా ఇకపై మరింతగా కెరీర్ పై గట్టిగా దృష్టి పెట్టారు విశ్వక్ సేన్. మరి ఓటిటి లో మెకానిక్ రాఖీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.