యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా యువ అందాల నటి మీనాక్షి చౌదరి హీరోయిన్ గా రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మెకానిక్ రాకీ. ఈ మూవీని ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి గ్రాండ్ లెవెల్లో నిర్మించగా జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఒకింత డీసెంట్ గా సాగిన మెకానిక్ రాకీ మూవీ సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించే ప్లాట్ తో సాగుతుంది. కొన్ని యాక్షన్ సీన్స్, ట్విస్ట్స్ ఆకట్టుకుంటాయి. మొత్తంగా అయితే థియేటర్స్ లో ఏమాత్రం పెర్ఫార్మ్ చేయని ఈమూవీ నేటి నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది.
అయితే ఓటిటి లో ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ముఖ్యంగా ఈ మూవీలో మెకానిక్ రాకీగా విశ్వక్ ఆకట్టుకోగా జెక్స్ బిజోయ్ సంగీతం, మీనాక్షి చౌదరి అందం, అభినయం కూడా బాగున్నాయి. ఇక ఈ ఏడాది ఈమూవీ ద్వారా కూడా విశ్వక్సేన్ విజయం అందుకోలేకపోయారు. మరి రాబోయే సినిమాలతో ఆయన ఎంతమేర సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.