Homeసినిమా వార్తలుMazaka Review : Engaging Comedy Entertainer మజాకా రివ్యూ : ఆకట్టుకునే కామెడీ యాక్షన్...

Mazaka Review : Engaging Comedy Entertainer మజాకా రివ్యూ : ఆకట్టుకునే కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ 

- Advertisement -

యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా రీతువర్మ హీరోయిన్ గా ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మజాకా.

ఇప్పటికే ప్రచార చిత్రాలతో అందరిలో మంచి అంచనాలు ఏర్పరచిన ఈ సినిమా నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. రావు రమేష్, అన్షు ఇందులో కీలకపాత్రలు పోషించగా లియాన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. మరి ఈ సినిమా యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం
సినిమా పేరు: మజాకా

రేటింగ్: 2.75/5

తారాగణం: సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ వర్మ, అన్షు, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

దర్శకుడు: త్రినాధరావు నక్కిన

నిర్మాత: రాజేష్ దండా

విడుదల తేదీ: 26 ఫిబ్రవరి 2025

కథ : 

వెంకటరమణ (రావు రమేష్) మరియు కృష్ణ (సందీప్ కిషన్) ఇద్దరూ తండ్రి కొడుకులు. అయితే కొడుకుని కని భార్య కన్నుమూయడంతో కొడుకుని తానే అన్ని అయి పెంచుతాడు వెంకటరమణ.

అయితే పెరిగి పెద్దయిన కొడుకు కృష్ణ పెరిగి పెద్దయిన అనంతరం మీరా (రీతూ వర్మ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు, అయితే అదే సమయంలో తాను మళ్ళి పెళ్లి చేసుకోవాలని భావించిన వెంకటరమణ ఒకానొక సమయంలో చూసిన యశోదని వివాహం చేసుకోవాలనుకుంటాడు.

మరి ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ తాము ప్రేమించిన వారిని చివరికి వివాహం చేసుకున్నారా, మధ్యలో ఎటువంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నారు అనేది మొత్తం కూడా మూవీలో చూడాల్సిందే. 

READ  ​Thandel Underperformance in America అమెరికాలో ఢీలాపడ్డ 'తండేల్' 

నటీనటుల పెర్ఫార్మన్స్ : 

ముఖ్యంగా ఈ మూవీలో చెప్పుకోవాల్సింది హీరో సందీప్ కిషన్, ఆయన తండ్రి పాత్ర చేసిన వెంకటరమణ పాత్ర చేసిన రావు రమేష్ గురించి. ఈ ఇద్దరూ కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు.

పలు కామెడీ, ఎంటర్టైన్మెంట్ సీన్స్ లో ఇద్దరూ అదరగొట్టారు. రీతూ వర్మ, అన్షు ల పాత్రలు పర్వాలేదనిపించగా మురళి శర్మ పాత్ర నవ్విస్తుంది. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన శ్రీనివాస రెడ్డి, హైపర్ ఆది, రఘుబాబు ల పాత్రలు కూడా కామెడీగా ఆకట్టుకున్నాయి. 

విశ్లేషణ : 

గతంలో తన నుండి వచ్చిన సినిమాల మాదిరిగా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఈ మూవీని కూడా కామెడీతో కూడిన సదా సీదా కథగా తెరకెక్కించారు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధంతో పాటు వారి మధ్య కామెడీ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలతో చాలావరకు సినిమాని నడిపించారు.

ఫస్ట్ హాఫ్ స్టోరీ అంతా తెలిసిన రీతిన నార్మల్ గానే సాగినప్పటికీ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో రీతూ వర్మ, అన్షు ల మధ్య వచ్చే సన్నివేశాలు కేవలం ఓకే అనిపిస్తాయి. అనకాపల్లి ఎపిసోడ్ తో పాటు మరికొన్ని సీన్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి అంతే. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం ఎమోషనల్ గా ఆడియన్స్ ని కనెక్ట్ చేసాయి. 

READ  Nani Movie with Tamil Director Fixed నానితో తమిళ్ డైరెక్టర్ మూవీ ఫిక్స్ 

ప్లస్ పాయింట్స్ : 

  • కామెడీ
  • ఇంటర్వెల్ ముందు వచ్చే మలుపులు
  • క్లైమాక్స్ ముందు సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ : 

  • బలహీనమైన భావోద్వేగ సన్నివేశాలు
  • కొన్ని బోరింగ్ సన్నివేశాలు
  • పాటలు

తీర్పు : 

ఓవరాల్ గా సందీప్ కిషన్, రావు మరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మజాకా మూవీ అక్కడక్కడా కొంత నెమ్మదించి కాస్త బోర్ గా అనిపించినప్పటికీ కామెడీ, ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే ఎమోషనల్ కనెక్ట్ మరింత బలంగా ఉంటె బాగుండేదనిపిస్తుంది. ఇక ఈ వారం ఈ మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ కోసం చూసేయొచ్చు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories