Homeసినిమా వార్తలుMathu Vadalara 2 Two Days Collection 'మత్తు వదలరా - 2' రెండు రోజుల...

Mathu Vadalara 2 Two Days Collection ‘మత్తు వదలరా – 2’ రెండు రోజుల కలెక్షన్ 

- Advertisement -

ఇటీవల మనం గమనించినట్లయితే టాలీవుడ్ లో చిన్న సినిమాలు కూడా మంచి విజయం అందుకుంటూ ఆడియన్స్ ని అలరిస్తూ విజయ బావుటా ఎగరవేస్తున్నాయి. అందుకు నిదర్శనం ఆయ్, కమిటీ కుర్రాళ్ళు, 35 మూవీస్. ఇక తాజాగా ఆ కోవలో చేరింది మరొక చిన్న చిత్రం మత్తు వదలరా 2

ఈ మూవీలో శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా, సత్య కీలక పాత్రలు చేయగా యువ దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఆడియన్స్ తో పాటు పలువురు సెలబ్రిటీస్ నుండి కూడా ప్రసంశలు అందుకుంటోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ పై ట్విట్టర్ వేదికగా పొగడ్తలు కురిపించారు. 

ఇక మత్తు వదలరా 2 మూవీ మొదటి రోజు రూ. 5.3 కోట్లు కొల్లగొట్టగా, మొత్తం రెండు రోజుల్లో రూ. 11 కోట్లు రాబట్టింది. మరోవైపు యుఎస్ఏ లో అప్పుడే 500 కె డాలర్స్ ని ఈ మూవీ అందుకుంది. మొత్తంగా సూపర్ డూపర్ హిట్ దిశగా కొనసాగుతున్న మత్తు వదలరా 2 మూవీ ఓవరాల్ గా ఎంత రాబడుతుందో చూడాలి. 

READ  Flop Movies Success Events ఫ్లాప్ మూవీస్ కి సక్సెస్ ఈవెంట్స్ అవసరమా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories