Home సినిమా వార్తలు మెగాస్టార్ తో మాస్ రాజా బాక్సాఫీస్ క్లాష్ 

మెగాస్టార్ తో మాస్ రాజా బాక్సాఫీస్ క్లాష్ 

chiranjeevi raviteja

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా యువ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ సినిమా మాస్ జాతర. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్  సంస్థలపై ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే తూ మేరా లవర్ అనే సాంగ్ యొక్క ప్రోమో రిలీజ్ చేయగా ఫుల్ సాంగ్ ని 14న విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాని జులై మూడో వారంలో గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర మూవీని జూలై 24 రిలీజ్ చేసేందుకు ఆ మూవీ టీమ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

మరి రవితేజ సినిమాను కూడా పక్కాగా ఇంచుమించు 18 లేదా 20 వ తేదిన రిలీజ్ చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ తో పాటు మాస్ రాజా మూవీ క్లాష్ తప్పదని అంటున్నాయి సినీ వర్గాలు. మరి పక్కాగా ఈ రెండు సినిమాల యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్స్ ఎప్పుడు అనౌన్స్ అవుతాయో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version