ఇటీవల కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు మాస్ మహారాజా రవితేజ. తాజాగా ఆయన హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా మాస్ జాతర. త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ కూడా బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు మేకర్స్. మొత్తం టీజర్ ని పరిశీలిస్తే ఇది రెగ్యులర్ కమర్షియల్ అంశాలతోనే రూపొందినట్టు తెలుస్తోంది. ఏమాత్రం పెద్దగా ఆకట్టుకునే అంశాలు టీజర్ లో లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విజువల్స్ పర్వాలేదంతే. అయితే రవితేజ పవర్ఫుల్ డైలాగ్స్, క్యారెక్టరైజెషన్ మాత్రం బాగానే ఉన్నాయి.
ఓవరాల్ గా మాస్ జాతర టీజర్ అయితే సినిమాపై ఏ మాత్రం అంచనాలు ఏర్పరచలేకపోయింది. ఇక ఈ సినిమాని భాను భోగవరపు తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ శ్రీనివాస్ సంస్థలపై గ్రాండ్ లెవెల్లో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. మాస్ జాతర మూవీ ఆగష్టు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరి రిలీజ్ అనంతరం ఈ సినిమా ఏ స్థాయి విజయవంతం అవుతుందో ఎంత కలెక్షన్ రాబడుతుందో ఉంటుందో చూడాలి