Homeసినిమా వార్తలు'మాస్ జాతర' రిలీజ్ పోస్ట్ పోన్ ?

‘మాస్ జాతర’ రిలీజ్ పోస్ట్ పోన్ ?

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా యువ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తుండగా రవితేజ ఇందులో పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు.

ఆకట్టుకునే మాస్ యాక్షన్ అంశాలతో పాటు రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఈ మూవీ రూపొందుతోందని టీమ్ చెప్తోంది. తాజాగా మాస్ జాతర నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన టీజర్ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది.

విషయం ఏమిటంటే, ఇప్పటికే ఆల్మోస్ట్ చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈమూవీ వాస్తవానికి ఆగష్టు 27న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఓవైపు ఇటీవల కింగ్డమ్ మూవీతో ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోవడం, మరోవైపు వార్ 2 మూవీ రైట్స్ తీసుకుని ఆశించిన లాభాలు అందుకోలేకపోవడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారని, అలానే కొన్నాళ్ళు మాస్ జాతరని వాయిదా వేసి మంచి టైం చూసి పక్కాగా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

READ  'మాస్ జాతర' టీజర్ : రొటీన్ ఫార్ములా

మరోవైపు రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ ఆగష్టు 27న రిలీజ్ ఉంటే ఈ పాటికి ప్రమోషన్స్ మొదలై ఉండాలి, కానీ అవేవి లేవంటే మూవీ వాయిదా పక్కా అని అంటునాన్రు. మరి మాస్ జాతర పక్కాగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలి అంటే టీమ్ నుండి దీనికి సంబంధించి అఫీషియల్ గా న్యూస్ బయటకు రావాల్సిందే

Follow on Google News Follow on Whatsapp

READ  మెగాస్టార్ 157 ఇంట్రెస్టింగ్ అప్ డేట్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories