Homeసినిమా వార్తలుమసూదా మొదటి వారం బాక్సాఫీసు కలెక్షన్లు

మసూదా మొదటి వారం బాక్సాఫీసు కలెక్షన్లు

- Advertisement -

చిన్న సినిమాగా భారీ అంచనాలు లేకుండా విడుదలైన మసూదా చిత్రానికి ఇటు విమర్శకులతో పాటు ప్రేక్షకుల దగ్గర నుండి చక్కని ప్రశంసలు లభించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి స్పందన వచ్చింది.

కాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో దాదాపు 5 కోట్ల గ్రాస్, 2.75 కోట్ల షేర్ వసూలు చేసింది. మసూదా యొక్క థియేట్రికల్ హక్కులు 2 కోట్లకు అమ్ముడయ్యాయి, అంటే ఇది మొదటి వారంలోనే బ్లాక్ బస్టర్ అయింది అన్నమాట.

ప్రస్తుతం కలెక్షన్ల ట్రెండ్ చూస్తుంటే మొదటి వారాంతం కంటే రెండవ వారాంతం ఎక్కువ కలెక్షన్లు సాధించేలా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మసూదాకు 50% వసూళ్లు నైజాం నుంచి వచ్చాయి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఈ సినిమాకు అత్యుత్తమ కలెక్షన్లు ఇచ్చిన ఏరియాగా నిలిచింది.

నిజానికి హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇతర జానర్‌ల కంటే ఎక్కువ ప్రజాదరణ పొందుతాయి. అందుకే ఆ తరహా సినిమాలు మంచి విజయాలను అందుకోవడం ఎక్కువగా జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో హారర్ జానర్ లో కామెడీని పెట్టి అలాంటి సినిమాలు తీస్తున్నారు.

అలాంటి పరిస్థితుల్లో ప్యూర్ థ్రిల్ కాన్సెప్ట్‌తో రూపొందిన జెన్యూన్ హారర్ మూవీగా ‘మసూదా’ వచ్చింది. వినూత్నమైన సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమా గతవారం విడుదలై, ప్రేక్షకులు తమ అభిమానాన్ని, ప్రశంసలను కురిపించడంతో పైన చెప్పినట్లుగా సర్ ప్రైజ్‌ హిట్ గా నిలిచింది.

READ  బాక్సాఫీస్ వద్ద భారీ జంప్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన మసూదా సినిమా

ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ అయిన ప్రతిభావంతురాలైన నటి సంగీత ప్రధాన పాత్రలో నటించారు. తిరువీర్, కావ్య కళ్యాణ్‌రామ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయి కిరణ్ దర్శకత్వం వహించారు.

మసూదాను రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్‌ విహారి సంగీతం అందించారు. శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, శ్రీధర్, సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఏదేమైనా.. ఇలాంటి చిన్న సినిమాలు ఎక్కువగా విజయం సాధించడం అనేది వాటికే కాదు తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఎంతో మంచిది. మరిన్ని చిన్న సినిమాలు ఎక్కువ విజయాలు సాధించాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  ఆదిపురుష్ సినిమా కొత్త విడుదల తేదీ వల్ల ఇరుకున పడ్డ సాలార్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories