ప్రముఖ దిగ్గజ నటుడు దివంగత రావుగోపాలరావు తనయుడిగా తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసిన రావు రమేష్, మొదటి నుండి ఒక్కో సినిమాతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ అందుకుంటూ కొనసాగుతున్నారు. ఇక మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెల్లగా కెరీర్ లో కొనసాగిన రావు రమేష్ ఇటీవల పలువురు పెద్ద స్టార్స్ సరసన అనేక సినిమాల్లో నటించి మెప్పించారు.
ఇక తాజాగా ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన మూవీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఈ మూవీకి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు మరియు బుజ్జి రాయుడు పెంట్యాల మరియు మోహన్ కార్య నిర్మించిన ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేయబడింది. ఇక రిలీజ్ అనంతరం అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సక్సెస్ సాధించి అందరి నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయింది. ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహా వారు ఈ మూవీని సెప్టెంబర్ 20న తమ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయనున్నట్లు నేడు ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. మరి మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఓటిటి ఆడియన్స్ ని ఎంత మేర మెప్పిస్తుందో చూడాలి.